List

Tel/proverbs

  1. అంగటివీథిలో అబ్బా అంటే, యెవరికి పుట్టినావురా కొడకా అన్నట్టు
  2. అంగట్లో అన్నీ వున్నవి, అల్లుని నోట్లో శని వున్నది
  3. అంగట్లో బెల్లము గుళ్లో లింగానికి నైవేద్యము
  4. అంగిట బెల్లము, ఆత్మలో విషము
  5. అంగిట విషము, మున్నాలికను తియ్యదనము
  6. అంటా ముట్టరాని అగ్రహారము
  7. అంటూ సంటూ ఆసాదివానిది, రట్టూ రవ్వా గంగానమ్మది
  8. అంటూ సంటూ లేని కోడలి దాని మేనమామ కొడుకు చిక్కుడు చెట్టుకిందికి పోయి పక్కలు యెగరవేశినాడట
  9. అంతమాత్రమా కొడకా చెవులు పట్టుకొని తడవేవు అన్నట్టు
  10. అంత్య నిష్టురముకన్నా ఆది నిష్టురమే మేలు
  11. అందము చిందినట్టు, నాగరికము నష్టమయినట్టు
  12. అందములో పుట్టిన గంధపుచెక్క, ఆముదములో పుట్టిన మడ్డి
  13. అందని మాని పండ్లకు ఆశ పడ్డట్టు
  14. అందరికి నేను లోకువ, నాకు నంబి రామాయ లోకువ
  15. అందరు వకయెత్తు, అగస్త్యుడు వకయెత్తు, అతని కమమండలం వక యెత్తు
  16. అందానికి రెండు బొందలు, ఆటకు రెండు తాళాలు
  17. అందులో పస లేదు, గంజిలో వార్చుమన్నట్టు
  18. అంధునకు అద్దము చూపినట్టు
  19. అంఅటి యేరు వచ్చినది అత్తగారూ అంటే, కొలబుర్ర నాచేతిలో వున్నది కోడలా అన్నదట
  20. అంబలి తాగేవారికి మీసాలు ఎగబట్టేవారు కొందరా
  21. అకట వికటపు రాజుకు అవిబేకి ప్రధాని, చాదస్తపు పరివారము
  22. అక్కన్న మాదన్నగారు అందలమెక్కితే, సాటికి వరప్ప చెరువు కట్ట యెక్కినాడట
  23. అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
  24. అగస్త్య బ్రాత
  25. అగ్గువ అయితే అంగడికి వస్తుంది
  26. అగ్గువ అయితే అందరూ కొంటారు
  27. అగ్నిలో మిడత పడ్డట్టు
  28. అగ్నిహోత్రమునకు పోయిన సోమిదేవమ్మ ఆరు నెలల గర్బముతో వచ్చినది
  29. అగ్నిహోత్రములో అజ్యము పోశినట్టు
  30. అచ్చం తిరుమణిధారి అయితే పుల్ల పట్టడంలోనే తెలుసును
  31. అచ్చివచ్చిన భూమి అడిగిడే చాలును
  32. అటయితే కందిపప్పు, యిటయెతే పెసరపప్పు
  33. అటయితే వైద్యకట్నము, యిటయితే వైతరణిగోదానము
  34. అట్లువండే ఆబిడకు ఆరుగురు అమర్చవలెను
  35. అడకత్తులోని పోక
  36. అడగనేరను, వూడ్చిపెట్టుమన్నట్టు
  37. అడిగేవానికి చెప్పేవాడు లోకువ
  38. అడియాశ పొడియాశ దుఃఖానకు కారణము
  39. అడవి కాచిన వెన్నెల
  40. అడవి నక్కలకు కొత్వాలు దురాయా
  41. అడవి వుశిరికకాయ, సముద్రపు వుప్పు కలిశినట్టు
  42. అడుగులోనే హంసపాదా
  43. అడుసులో నాటిన స్తంభము
  44. అడ్డగోడమీది పిల్లి
  45. అడ్డెడు తవ్వెడు బియ్యము యిచ్చి అమ్మా నీ ప్రసాదము అన్నట్టు
  46. అతడు వుంటే మంగలివాణ్ని అయినా పిలుచును
  47. అతిరహస్యం బట్టబయలు
  48. అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ, కోడలు కొట్టిన కుండ కొత్త కుండ
  49. అత్తగారి సాధింపు
  50. అత్త చస్తే కోడలు యేడ్చినట్లు
  51. అత్తచేశిన పనులకు ఆరళ్లు లేవు
  52. అత్తతో చెప్పి అషు అనిపించలేడుగాని, లంభించడానకు బ్రహ్మకొడుకు
  53. అత్తపేరు బెట్టి కూతురిని కుంపట్లో వేశినట్లు
  54. అత్త మంచీ, వేముల తీపూ లేదు
  55. అత్తలేని కోడలు వుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు
  56. అత్తవల్ల దొంగతనమున్ను, మగనివల్ల రంకున్ను నేర్చుకొన్నట్టు
  57. అత్తవారింటి సుఖము మోచేతి దెబ్బవంటిది
  58. అత్తా వకరింటి కోడలే
  59. అత్తి పూచినట్టు
  60. అదంత్రునికి ఆశపెట్టరాదు, బలవంతునికి చోటివ్వరాదు
  61. అదికుమ్ము, యిదిదుమ్ము, పదరా పందిట్లోకి
  62. అదుగో అంటే ఆరునెలలు
  63. అదే పతకమయితే మనము బ్రతకమా
  64. అదేమి రెడ్డీ వంగి వంగి నడుస్తావంటే, యెప్పటికాలు అట్టెట్టే అన్నాడట
  65. అద్దముమీద పెసర గింజ పడ్డట్టు
  66. అద్దములోని ముడుపు
  67. అద్దెకు వచ్చిన గుర్రాలు అగడ్తెలు దాటుతవా
  68. అద్దె పేరంటము, శిద్దె మురికి
  69. అధమునికి ఆలయ్యేటంతకంటే, బలవంతునికి బానిసె అయ్యేది మేలు
  70. అధిక ఆషాఢం
  71. అధికాశ లోకదారిద్ర్యము
  72. అని అనిపించుకోవలెనా అత్తగారా
  73. అన్నచొరవేగాని, అక్షరచొరవలేదు
  74. అన్నము పెట్టితే అరిగిపోతుంది, చీరయిస్తే చిరిగిపోతుంది, వాతపెట్టితే కలకాలము వుంటుంది
  75. అన్నము లేకపోతే వరి అన్నము బట్ట లేకపోతే పట్టుబట్ట
  76. అన్నరసముకన్నా ఆదరణరసము మేలు
  77. అన్నిబొండాల నీళ్లూ నీవే తాగరా అయ్యల్లా
  78. అన్నీ వున్నవి, అయిదువతనము లేదు
  79. అన్యాయపురిలో ఆలూ మగడికి రంకు
  80. అపకారియినా వుపకారమే చెయ్యవలెను
  81. అప్పటిమాటలకు దుప్పటి యిచ్చినానుగాని, కలకాలము కప్పుకోనిచ్చినానా
  82. అప్పవంక బావచుట్టము, ఆళ్లవంక తిరగలి చుట్టము
  83. అప్పు ఆకటికి వచ్చునా
  84. అప్పు దొరికితే పప్పుకూడు
  85. అప్పు మొప్పు
  86. అప్పు యిచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడగోరును
  87. అప్పు లేకపోతే వుప్పుగంజే మేలు
  88. అప్పులేని గంజి దొప్పెడే చాలును
  89. అబద్ధాలకు అర్థములేదు
  90. అబద్ధాల పంచాఅంగముకు అరవైగడియలు త్యాజ్యము
  91. అబ్బిగాడు చస్తే ఆ పంచె నాది
  92. అబ్బితే శిగ, అబ్బకపోతే కాళ్లు
  93. అబ్బురాన బిడ్డ పుట్టెను, గడ్డపార తేరా చెవులు కుట్టుతాను
  94. అభ్యాసము కూసువిద్య
  95. అభ్యాసము లేని రెడ్డి అందలమెక్కితే అటూ యిటూ అయినదట
  96. అమర్చినదాంట్లో అత్తగారు వేలు పెట్టినది
  97. అమావాస్య ప్రొద్దుకు వంగలు కాచునా
  98. అమ్మగా మిగిలిన మేక
  99. అమ్మ గృహప్రవేశము, అయ్య శ్మశానప్రవేశము
  100. అమ్మ చెడ్డ చేటుకు ముసుకు వకటా
  101. అమ్మ తానూ పెట్టదు, తిరుచుకొనీ తిననివ్వదు
  102. అమ్మదగ్గిర కింద పడుకొన్నా వకటే, అబ్బదగ్గిర నేల పడుకొన్నా వకటే
  103. అమ్మ పెట్టేవి నాలుగూ అప్పుడే పెట్టితే చెయ్యనా
  104. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి
  105. అయితంపూడి వుద్యోగము అయితే గియితే, ఆరావుల పాడిచేస్తే గీస్తే, పెరుగూ పాలూ మీవారికి పోస్తావా మావారికి పోస్తావా
  106. అయితే అతడి ఆలాయె, కాకపోతే దాసురాలాయె
  107. అయితే ఆరుగ, కాకుంటే కంది
  108. అయినవారందరు ఆ దోవను పోగా, జంగాన్ని పట్టుకొని జాము యేడ్చినాడు
  109. అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమేకాని, అమ్మకు సవితిపోరు అని యెరగడు
  110. అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వమూ లేదు
  111. అయ్య దాసండ్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టినది
  112. అయ్యనీటు అడిగితీరదు, అమ్మ దమ్మయపాలెంలో దంచుకొని తాగుతున్నది
  113. అయ్య రాకుంటే అమావాస్య అట్టె వుంటుందా
  114. అయ్య వాతబెట్టనూ బర్రె బ్రతకనా
  115. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినది
  116. అయ్యవారు అటికంత, అయ్యవారి పెండ్లాము పుటికంత
  117. అయ్య సవాశేరు, లింగము అరవీశెడు
  118. అరచేత వెన్నపెట్టుకొని నేతికి యేడ్చినట్టు
  119. అరచేతి రేగుబంటికి అద్దము కావలెనా
  120. అరచేతిలో వుప్పు పెట్టితే ఆరునెలలు తలుచుకోవలెను
  121. అరచేతిలో వైకుంఠము చూపుతాడు
  122. అరణ్య రోదనము
  123. అరవ యేడుపు
  124. అరవై యేండ్లయితే అరులు మరులు
  125. అరవై యేండ్లయిన తర్వాత అమ్మా అన్నాడట
  126. అరవై యేండ్లయినవి, చదువుకోకుండా మొత్తుకొంచానా అన్నాడట​
  127. అరవై వరహాలు యిచ్చినా అత్తవంటి బానిసె దొరకదు
  128. అరిచే కుక్క కరవ నేరదు
  129. అరిటాకు వచ్చి ముంటిమీద పడ్డా అరిటాకుదే కష్టము, ముల్లు వచ్చి అరిటాకుమీద పడ్డా అరిటాకుదే కష్టము
  130. అరిటిపండు వలిచి చేత వుంచినట్టు
  131. అరుంధతీ కనబడదు, అధ్వాన్నమూ కనపడదు, అరవై వరహాల అప్పు మాత్రము కనపడుతున్నది
  132. అర్తి దుఃఖం ఆరునెలలు, కడుపు దుఖం కలకాలం
  133. అర్థమూ ప్రాణమూ ఆచార్యాధీనము, తాళమూ దేహమూ నా ఆధీనము
  134. అలవాటులేని ఔపాసనం చెయ్యబోతే మీసాలన్నీ తెగకాలినవి
  135. అలివిగాని ఆలిని కట్టుకొని మురిగిచచ్చెరా ముండా కొడుకు
  136. అల్పునకు ఐశ్వర్యం వస్తే, అర్ధరాత్రివేళ గొడుగు తెమ్మన్నాడట
  137. అల్లి అడిగినది, యిల్లి యిచ్చినది, మల్లి మాయము చేశినది
  138. అల్లుడలిగితే కూతురిని తీసుకొని పోతాడు
  139. అల్లుడికి నెయ్యీలేదు, అల్లుడితోటికూడా వచ్చినవారికి నూనే లేదు
  140. అల్లుడికి వండిన అన్నము కొడుకుకు పెట్టి కొట్టుకొన్నదట
  141. అల్లులలో మల్లు పెద్ద
  142. అవలక్షణము గలవానికి అక్షతలు యిస్తే, అవతలికి పోయి నోట్లో వేసుకొన్నాడట
  143. అవసరగానికి ఆకులో పెట్టు, నాకు నేలను పెట్టు
  144. అవివేకితో స్నేహముకన్నా వివేకితో విరోధము మేలు
  145. అవ్వను పట్టుకొని వసంతాలాడినట్టు
  146. అవ్వ వడికిన నూలు తాత మొలతాటికి సరి
  147. అవ్వా కావలెను, బువ్వా కావలెను
  148. అశుద్ధముమీద రాయివేస్తే ముఖాన పడుతుంది
  149. అశ్రద్ధపితాళ్లకు యేతాం తర్పణము
  150. అసలు సోమిదేవమ్మ, అందులో వేవిళ్లు
  151. అ అంటే అపశబ్దము, నారాయణా అంటే బూతుమాట
  152. ఆకలి ఆకాశమంత, గొంతుక సూది బెజ్జమంత
  153. ఆకలి కాని భోజనము, ఆలి మీద లంజరికము
  154. ఆకలిగొన్న కరణము పాతకవిలె తీశినాడు
  155. ఆకలి యెత్తుతుంది అత్తగారా అంటే, రోకలి మింగవే కోడలా అన్నదట
  156. ఆకలి రుచి యెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు శిగ్గు యెరగదు
  157. ఆకాశ పంచాంగము
  158. ఆకాశ వర్తకుడు
  159. ఆకును అందదు, పోకను పొందదు
  160. ఆకుపోయి నూతపడితే, వెతకపోయి యేడుగురు పడ్డారట
  161. ఆగడపలు వేశినవి అత్తగారా అంటే, కొలబుర్ర నాచేతిలో వున్నది కోడలా అన్నదట
  162. ఆగభోగాలు అక్క కుడిస్తే, అంబటి పరకలు బావ కుడిచినాడు
  163. ఆగ్రహాన ఆనపెట్టుకున్నట్టు
  164. ఆచారం అదిరిపడ్దదీ, ధూపార్తి తుళ్లిపడ్డది, కొత్త కుండ తేరా నెత్తాళ్లు వండుకొందాము
  165. ఆచారం ఆచారం అన్నంభొట్లూ అంటే, పెద్ద చెరువు కుక్క ముట్టుకొన్నది అన్నట్టు
  166. ఆచారానకు అంతమూ లేదు, అనాచారానకు ఆదీ లేదు
  167. ఆచార్యుని తలచి నిప్పులో చెయ్యిపెట్టితే కాలదా?
  168. ఆటా తీరె, పాటా తీరె, కోటలో రామరాజ్యము
  169. ఆడదానిచేతి అర్థమూ, మొగవానిచేతి బిడ్డా బ్రతకదు
  170. ఆడదాని మాట, నీళ్ల మూట
  171. ఆడది బొంకితే గోడ పెట్టినట్టు, మొగవాడు బొంకితే తడిక కట్టినట్టు
  172. ఆడ నేరక మద్దెలమీద తప్పు చెప్పినట్టు
  173. ఆడపెత్తనము, తంబళి దొరతనము
  174. ఆడబోయిన తీర్థము యెదురుగా వచ్చినది
  175. ఆడి తప్పరాదు, పలికి బొంకరాదు
  176. ఆ తండ్రికి కొడుకు కాడా
  177. ఆతురగానికి తెలివి మట్టు
  178. ఆ తుష్టికీ యీ నష్టికీ సరి
  179. ఆత్మస్తుతీ, పరనిందా, అర్థాపేక్షా, లేని మహానుభావుడికి నాకూ డబ్బు, శుద్ధశుంఠకు వాడికీ డబ్బా
  180. అత్మా రావే నూతపడుదాము అంటే, ఆదివారము రోజున అందరమూ పడుదాము అన్నదట
  181. ఆదాయము లేకనే శెట్టి వరదబోడు
  182. ఆపతి మొక్కులు, సంపతి కుంట్లు
  183. ఆ పప్పు యీ నీళ్లకు వుడకదు
  184. ఆపస్తంబులా ఆశ్వలాయనులా అంటే, ఆపస్తంబులమూ కాము, ఆశ్వలాయనులమూ కాము, అప్పారావుగారి హర్కారాలము అన్నారట
  185. ఆ బుర్రలో విత్తనాలే
  186. ఆమడలు దూరమయితే, అంతఃకరణలు దూరమా
  187. ఆముదపు చేటేగాని, బిడ్డ బ్రతకడము లేదు
  188. ఆముదములో ముంచిన యేకువలె వున్నాడు
  189. ఆయం తప్పితే గాయమంత సుఖము లేదు
  190. ఆయన ముందర పోవలె
  191. ఆరగించగా లేనిది అడిగితే వస్తున్నదా
  192. ఆరాటపు కదురు యే రాటాన బెట్టినా బర బర
  193. ఆరుగ కోశిన ముహూర్తాననే కంది కూడా కొయ్యండి
  194. ఆరు నెలలనుంచి వాయించిన మద్దెల వోటిదా గట్టిదా అని అడిగినట్టు
  195. ఆరెల మానుకింద బూరెల మాను విరగబడ్డట్టు
  196. ఆర్చేవా, తీర్చేవా, అక్కర వస్తే ములిగేవా
  197. ఆర్చేవారే గాని, తీర్చేవారు లేరు
  198. ఆలికి అన్నము పెట్టడము వూరికి వుపకారమా
  199. ఆలిని వల్లని వానికి యీలకూరలో వుప్పు చాలదు
  200. ఆలి వంకవారు ఆత్మబంధువులు, తల్లి వంకవారు తగినవారు, తండ్రి వంకవారు దాయాదులు
  201. ఆలు కాదు, అది వ్రాలు
  202. ఆలు వల్లక అరవై యేండ్లు, మొగుడు వల్లక ముప్ఫయి యేండ్లు, బాలప్రాయము పది యేండ్లు
  203. ఆలూ మొగునిసందు పోట్లాట అద్దముమీద పెసరగీంజ వేశినంత సేపు
  204. ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం
  205. ఆవగింజకు సందువుంటే, అరవై గారెలు అప్పుడే తిననా
  206. ఆవ తిన్న అమ్మకు యేవ పారినదట
  207. ఆవలింతకు అన్నదమ్ములున్నారుగాని, తుమ్ముకు తమ్ముడయినా లేడు
  208. ఆవాలు ముద్ద చేశినట్టు
  209. ఆవు చేనిలో మేస్తే, దూడ గట్టున మేసునా
  210. ఆవు పాడి యెన్నాళ్లు ఐశ్వర్యం యెన్నాళ్లు, బర్రె పాడి యెన్నాళ్లు భాగ్యం యెన్నాళ్లు
  211. ఆవుల మళ్లించినవాడు అర్జునుడు
  212. ఆవులూ ఆవులూ పోట్లాడితే, లేగల కాళ్లు విరుగుతవి
  213. ఆశకు అంతము లేదు
  214. ఆశపడి ఆరు లంఖణాలుచేస్తే, ఆవేళా జొన్న మెతుకేనా
  215. ఆశ బోధిస్తున్నది, అవమానము బాధిస్తున్నది
  216. ఆశలేని కూటికి ఆకలి లేదు
  217. ఆశ శిగ్గు యెరగదు, నిద్ర సుఖమెరగదు
  218. ఆశా పాతక బాపడు గోచిపాతలో తూమెడు కట్టుకొన్నాడట
  219. ఆసోది మాటలకు అర్థమూ లేదు, గుడ్డి కంటికి చూపూ లేదు
  220. ఆహారమందూ వ్యవహారమందూ శిగ్గు పడకూడదు
  221. ఇంగువ కట్టిన గుడ్డ
  222. ఇంటింటికీ మట్టి పొయ్యి
  223. ఇంటింటికీ వక మట్టిపొయ్యి అయితే, మాయింట మరి వకటి
  224. ఇంటికన్నా గుడి పదిలము
  225. ఇంటికి జ్యేష్ఠాదేవి, పొరుగుకు లక్ష్మీదేవి
  226. ఇంటిదీపమని ముద్దు పెట్టుకొంటే, మూతిమీసాలన్నీ తెగగాలినవట
  227. ఇంటిదేవర యీగి చస్తే, పొలందేవర గంపజాతర అడిగినదట
  228. ఇంటిదొంగను యీశ్వరుడూ పట్ట లేడు
  229. ఇంటినిండా కోళ్లు వున్నవిగని, కూశేటందుకు కోడి లేదు
  230. ఇంటిపేరు కస్తూరివారు, యిల్లు గబ్బిలాలవాసన
  231. ఇంటిమీద రాయి వేశి వీపు వొగ్గేవాడు
  232. ఇంటివాడు గొడ్డుగేదె అంటే, పొరుగువాడు పాడిగేదె అన్నట్టు
  233. ఇంటివాణ్ని లేపి దొంగచేతికి కట్టె యిచ్చినట్టు
  234. ఇంటివారు వేలు చూపితే, బయిటివారు కాలు చూపుతారు
  235. ఇంటివెనకాలకు వెళ్లి యిల్లు ముందుకు తెచ్చినట్టు
  236. ఇంటిసొమ్ము యిప్పపిండి, పొరిగింటి సొమ్ము పొడిబెల్లము
  237. ఇంట్లో పాయసమున్న మందలో పాలుకూడానా
  238. ఇంట్లో పెండ్లి అయితే, వూళ్లో కుక్కలకు అడావుడీ
  239. ఇంట్లో యీగపులి, బయిట పెద్దపులి
  240. ఇంట్లో యీగలమోత, బయిట సవారీలమోత
  241. ఇంతమంది దొరలు చావకపోతే, నేను మాత్రము చస్తానా, నాకూ అక్కరలేదు అన్నాడట
  242. ఇక్కడ అక్కడ వుంటే యీడేరి పోతావు, నాయింటికి రావే నవిశిపోతువుగాని అన్నాడట
  243. ఇచ్చినవాడు దాత, యివ్వనివాడు పాత
  244. ఇచ్చినవాడే మెచ్చినవాడు, చచ్చినవాడే అచ్చినవాడు
  245. ఇచ్చి పుచ్చుకొని మొగుడి వీపెల్లా తడివినట్టు
  246. ఇచ్చి వచ్చే నిష్ఠురముకన్నా, యివ్వక వచ్చే నిష్ఠురము నయము
  247. ఇచ్చుడుకాడూ గాడు, చచ్చుడుకాడూ గాడు, పూట పూటకూ కూటికి వచ్చుడుగాడు
  248. ఇచ్చేవాణ్ని చూస్తే, చచ్చేవాడైనా లేచును
  249. ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందూ వద్దు
  250. ఇత్యర్థలు యిగురు, ఇతిభావలు పులుసు
  251. ఇది చలమో ఫలమో
  252. ఇదుగో పులి అంటే, అదుగో తోక అన్నట్టు
  253. ఇనప గుగ్గిళ్లు గాని, మినప గుగ్గిళ్లు కావు
  254. ఇనుము కరిగేచోట యీగలకేమి వున్నది
  255. ఇనుము, తీట, పేము, పట్టిన చెయ్యి వూరకుండదు
  256. ఇనుమున గూర్చి అగ్నికి సమ్మెటపెట్లు
  257. ఇనుము విరిగితే అతక వచ్చుగాని, మనసు విరిగితే అతక కూడదు
  258. ఇన్నాళ్లు బ్రతికి యింటివెనక చచ్చినట్టు
  259. ఇప్పపూలకు వాసన వెతక వలెనా
  260. ఇరుపోటీల యిల్లు చెడును, వాతనొప్పుల వొళ్లు చెడును
  261. ఇల్లలకగానే పండగ అవుతున్నదా
  262. ఇల్లాలు గుడ్డిదయితే ఇంటి కుండలకు చేటు
  263. ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు
  264. ఇల్లు కాలినది జంగమయ్యా అంటే, నా జోలే కప్పరా నావద్దనే వున్నవి అన్నాడట
  265. ఇల్లు కాలుచుండగా వాసాలు దూసుకొన్నట్టు
  266. ఇల్లు గెలవలేనివాడు రచ్చ గెలుచునా
  267. ఇల్లు చొరబడి యింటివాసాలు లెక్కపెట్టినాడట
  268. ఇల్లు తిరిగి రమ్మంటే, యిలారం తిరిగి వచ్చినట్టు
  269. ఇల్లు మింగే అత్తగారికి యుగము మింగే కోడలు
  270. ఇల్లు ఇర్కటం, ఆలు మర్కటం
  271. ఇల్లు యేడ్చే అమావాస్య, యిరుగూ పొరుగూ యేడ్చే తద్దినం, వూరుయేడ్చే పెండ్లి లేదు
  272. ఇల్లు విప్పి పందిలి వేశినట్టు
  273. ఇల్లు వెళ్లగొట్టగా విడుపుల శృంగారము, మొగుడు వెళ్లగొట్టగా మొత్తల శృంగారము
  274. ఇల్లు వెళ్లిపోరా నంబీ అంటే, నా మాన్యము యెక్కడ అని అడిగినాడట
  275. ఇల్లెక్కి కొరివి తిప్పినట్టు
  276. ఇల్లెల్లా కొట్టితే, తట్టెడు పెంకులు లేవు
  277. ఇల్లే తీర్థం, వాకిలే వారణాశి, కడుపే కైలాసం
  278. ఇవతల చెర, అవతల సొర, నడమ రామరాజ్యము
  279. ఇవ్వని మొండికి విడవని చండి
  280. ఇషుంట రమ్మంటే, యిల్లంతా చేకొన్నట్టు
  281. ఇసుక తక్కిడి, పేడ తక్కిడి
  282. ఇస్తి వాయనము, పుచ్చుకొంటి వాయనము
  283. ఇస్తే చెడేది లేదు, చస్తే వచ్చేది లేదు
  284. ఇస్తే పెండ్లి, యివ్వకపోతే పెటాకులు
  285. ఈ కంటికి యీ రెప్పలు దూరమా
  286. ఈగకు యిలి, పాముకు బలి పుట్టదు
  287. ఈ చేత చేసి ఆ చేత అనుభవించినట్టు
  288. ఈతకంటే మించిన లోతు లేదు